అర్నబ్ తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం సమీక్ష
కాకినాడ జిల్లాలో అర్నబ్ తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా ఆ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ (Harendira Prasad), ఇతర అధికారులతో సమీక్షించారు. తుపానుతో జరిగిన నష్టం, పునరుద్ధరణ చర్యలపై ఆరా తీశారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై పవన్ ప్రత్యేకంగా చర్చించారు. తుపాను నష్టం, సహాయక చర్యలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్షలో జిల్లా ఎస్పీ బింంధుమాధవ్ (SP Bindhumadhav), మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.








