సంప్రదాయ అందానికి మృణాల్ మోడ్రన్ టచ్!`
వెండితెరపై తన నటనతోనే కాకుండా అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అందాల భామ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మరోసారి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. ఆలివ్ గ్రీన్ శారీలో సంప్రదాయ సొగసును చాటుతూ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది. మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌కు మ్యాచింగ్‌గా చిన్న చిన్న డిజైన్లతో కూడిన చీరను ధరించి ఎంతో అందంగా కనిపిస్తుంది. చీర అంచున ఉన్న కలర్‌ఫుల్ హ్యాంగింగ్స్, స్పెషల్ డిజైన్ ఆమె లుక్కు మరింత ఎట్రాక్టివ్ గా మార్చాయి. అవుట్‌ఫిట్ కు తగ్గట్టు ఇయర్ రింగ్స్, చేతికి అందమైన రింగ్స్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. సింపుల్ హెయిర్ స్టైల్, నేచురల్ మేకప్‌తో మృణాల్ అందం మరింత ఇనుమడించింది. ఈ ఫోటోల్లో మృణాల్ చిరునవ్వుతో కెమెరాకు పోజులిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేయగా, ప్రస్తుతం అవి నెట్టింట సందడి చేస్తున్నాయి.








