ది ప్యారడైజ్ ఎఫెక్ట్.. నెక్స్ట్ మూవీతో శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయత్నం! I
దసరా(Dasara) సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela), నేచురల్ స్టార్ నాని(Nani)తో కలిసి ది ప్యారడైజ్(The paradise) సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రమోషన్లలో చూపించిన ఆసక్తికరమైన అంశాలకు, సినిమాలోని కథనానికి మధ్య వ్యత్యాసం ఉందంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. థియేటర్లలో రిలీజైన టైమ్ లో మొదలైన విమర్శలు, ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుండటంతో ఈ సినిమా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014 తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఓ విభిన్నమైన ప్రేమకథను రూపొందించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఉద్యమ పరిస్థితుల మధ్య ప్రేమకథను ఆవిష్కరించే ఈ కథాంశం నిజమైతే, డైరెక్టర్ నుంచి మరో కొత్త తరహా ప్రయత్నం చూడొచ్చనే ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా ఇప్పటికే డిస్కషన్స్ లో ఉంది. చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు టైమ్ పట్టే అవకాశం ఉందని నాని(Nani) గతంలో వెల్లడించారు. దీంతో ముందుగా ప్రేమకథను తెరకెక్కిస్తారా? లేక చిరంజీవి సినిమాను ప్రారంభిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.








