అమరుల కుటుంబాలను ఏనాడైనా ఆదరించారా? : సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
సిద్దిపేట గడ్డపై గత వైభవాన్ని ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అనంతుల మదన్ మోహన్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది
1983 లో కెసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఘనత మదన్ మోహన్ గారిది
తొలి 1985 వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఎగరేశారు
వారి పేరును చరిత్ర పుటల్లోంచి చెరిపేయాలని కెసీఆర్, హరీష్ కుట్రలు చేశారు
అందుకే సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ గారిని ఆదేశిస్తున్నా
సిద్దిపేట గడ్డపై కేసీఆర్ కు మొట్ట మొదటిసారిగా రాజకీయ భిక్ష పెట్టింది మదన్ మోహన్ గారు
అవకాశం ఇచ్చిన ఆయనపైనే పోటీకి దిగారంటే నమ్మకద్రోహం కేసీఆర్ రక్తంలోనే ఉందని తేటతెల్లమైంది
ఎమ్మెల్యేను చేసిన ఎన్టీఆర్ కు, మంత్రిని చేసిన చంద్రబాబు పార్టీకి వెన్నుపోటు పొడిచి కొత్త దుకాణం పెట్టుకుండు
రబ్బరు చెప్పుల హరీష్ రావు 2004 లో వార్డు మెంబర్ కూడా కాదు
వైఎస్ భిక్షతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచాడు హరీష్ రావు
ఆనాటి నుంచి హరీష్ రావు సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ పై కుట్రలు మొదలు పెట్టారు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని గజ్వేల్ గడ్డ సాక్షిగా చెప్పాం.. చేసి చూపించాం
ఇప్పుడు సిద్దిపేట గడ్డ సాక్షిగా చెబుతున్నా…
2029 లో రెండోసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
మామ పోతే అల్లుడు.. అల్లుడు పోతే బామ్మర్ది.. వాడు పోతే వీడు… వీడు పోతే వాడు ఏలడానికి సిద్దిపేట అనాథల రాజ్యమా
సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించండి… మంత్రిని చేసే బాధ్యత మాది.
హరీష్ కు ఆప్తుడిగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి పరిస్థితి ఏమిటి..
వారి ఆర్ధిక పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి
సోలిపేట రామలింగారెడ్డి ప్రాణాలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతే.. హరీష్ కు వేల కోట్లు ఎలా వచ్చాయి
జగ్గారెడ్డి అప్పుల్లో కూరుకుపోయారు.. హరీష్ కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?
చెరుకు ముత్యంరెడ్డి, కేసీఆర్ ఒకేసారి మొదలుపెట్టారు
తొలి తరంలో చెరకు ముత్యంరెడ్డి, కేసీఆర్ ను చూడండి
రెండో తరంలో సోలిపేట రామలింగారెడ్డి, హరీష్ ను చూడండి
పక్కన సిరిసిల్లలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన పాపారావు పరిస్థితి ఏంటి.. కేటీఆర్ పరిస్థితి ఏంటి
కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌసులు, వేల కోట్లు ఎలా వచ్చాయి
కేటీఆర్ మామకు, హరీష్ బామ్మర్ది సుమన్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి
ఇటీవల తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు .. వీళ్లకు మాత్రం వేల కోట్లు ఎలా వచ్చాయి
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కొడుకు, అల్లుడికి మంత్రి పదవి ఇచ్చావ్, బిడ్డను ఎంపీగా గెలిపించుకున్నావ్
పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లి, శ్రీనివాస్ యాదవ్ కు పదవులు ఇచ్చావ్
కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎందుకు ఇంత అన్యాయం చేశావ్
ప్రజా ప్రభుత్వంలో శంకరమ్మకు మహిళా కమిషన్ సభ్యులురాలుగా నియమించాం.. భవిష్యత్ లో ఇంకా ఇస్తాం
చాకలి ఐలమ్మ మనుమరాలికి మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం
పాపాల భైరవుడు రావాలంట.. ప్రజా పాలన పోవాలట
మళ్లీ వచ్చి తెలంగాణను ఉన్నకాడికి ఊడ్చుకోవాలని చూస్తున్నారు
సాగునీటి ముసుగులో మీ మొసలి కన్నీళ్లు ప్రజలకు తెలుసు
నేను ఈ తెలంగాణ బిడ్డను… ఈ గడ్డపైనే పుట్టా.. ఈ మట్టిలోనే కలుస్తా
అలాంటింది తెలంగాణకు నేను అన్యాయం చేస్తానా?
నన్ను ఆశీర్వదించిన తెలంగాణ నెలకు నేను అన్యాయం చేస్తానా?
ఈ దుర్మార్గులు.. నీచులు నన్ను శంకించేలాఆటలాడుతున్నారు.
2014 ప్రభుత్వంలో సాగునీటి మంత్రి నువ్వే కదా హరీష్ రావు
మరి రెండోసారి అధికారంలోకి వచ్చాక మీ మామ నీకు ఎందుకు సాగునీటి మంత్రి పదవి ఇవ్వలేదు హరీష్
నీ దొంగ పనులు తెలిసి నీకు పదవి ఇవ్వని సంగతి నిజం కాదా?
నీ కక్కుర్తితోనే కాళేశ్వరం కూలేశ్వరం అయింది
ఏ మొఖం పెట్టుకుని ఇవాళ బజారులో తిరుగుతున్నావ్ హరీష్
మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు మరణ శాసనం రాసింది మామ అల్లుళ్ళు కాదా?
ప్రగతి భవన్ లో జగన్ కు స్వాగతం పలికి రాయలసీమ లిఫ్ట్ కట్టుకోమని చెప్పింది నువ్వు కాదా?
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్యాయం చేసింది మీరు కాదా?
ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగి పాల కంపెనీ పెట్టిన నువ్వా నా గురించి మాట్లాడేది
మీ జాతకాల చిట్టా విప్పుతా.. రండి అసెంబ్లీలో చర్చిద్దాం
పంచ భూతాలను చెరబట్టిన దుష్ట చతుష్టయం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు.
బతుకమ్మ చీరలలోనూ కమిషన్లు వదలలేదు
మేం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేశాం
ఆస్తి కోసం సొంత చెల్లిని ఇంట్లోంచి గెంటేసిన ఒకాయన రాష్ట్రంలో ఆడబిడ్డలను చూస్తారట
మీరు ఎన్ని బహురూపు వేషాలు వేసినా ప్రజలు నమ్మరు
బీఆరెస్ కు గతమే.. భవిష్యత్ లేదు..
2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే వుంటుంది… మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీనే
గ్యారంటీలు ఏమయ్యాయని మాట్లాడుతున్నారు
వాళ్లకు నేను ఒక్కటే చెప్పదలచుకున్నా
1983 నుంచి 2023 వరకు నాలు దశాబ్దాలు ఎన్టీఆర్, వైఎస్, కెసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ఏవైనా నేను ఆపానా?
ఉన్న పథకాలకు కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నాం
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశాం
రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశాం
మూడేళ్ళల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. 2 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి
గుడిసె లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం
పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం
36 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చింది మేము కాదా?
1 లక్షా 78 వేల కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు చేసింది మేం
వరి వేస్తే ఉరి ఆని చెప్పింది మీరు.. సంక వడ్లకు బోనస్ ఇచ్చింది మేము
200 యూనిట్ల కరెంటు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, కోటి మందికి కోటి చీరలు ఇచ్చింది ఎవరో ఆలోచన చేయండి
తెలంగాణ ప్రజలు బానిసత్వం కావాలో.. మా ప్రజా పాలన కావాలో ఆలోచన చేయండి







