సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం .. పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం
• ఎస్ఐపీబీ సమావేశానికి వర్చువల్గా హాజరైన మంత్రులు లోకేష్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేష్
• పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో చర్చ
• గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపై దృష్టి పెట్టాలని సూచించిన సీఎం
• మొత్తం 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్టు వెల్లడించిన అధికారులు
• పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు వీలుగా విశాఖలో ఓ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు అయ్యేలా చూడాలని ఆదేశించిన సీఎం
• రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమన్న ముఖ్యమంత్రి
• లాజిస్టిక్స్ హబ్లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టులతో పాటు ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని సూచించిన సీఎం
• సెమీ కండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టం రాష్ట్రంలో ఏర్పాటు కావాలన్న ముఖ్యమంత్రి









