చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. తాజా పరిణామాలపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెళ్లారు. మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు, తాజా పరిణామాలపై సీఎంతో పవన్ చర్చించారు. దీంతో పాటు స్థానిక ఎన్నికల్లో రెబల్స్ వ్యవహారంపైనా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ ( ZPTC) ఎన్నికలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. సీఎం నివాసానికి పవన్ ఎలాంటి సెక్యూరిటీ, కాన్వాయ్ లేకుండా ఒంటరిగా వచ్చారు. కొద్దిసేపు చంద్రబాబుతో చర్చించి అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.








