మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కాకినాడ (Kakinada)లోని ఆసుపత్రికి తరలించి ఐసియు లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. యనమల ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు. దీంతో ఎంపి సానా సతీష్ బాబు (MP Sana Satish Babu) ఆసుపత్రికి వెళ్లి యనమలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.








