పోలీసుల అదుపులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయనతో పాటు మాజీ మంత్రి అంజాద్ బాషా ( Amzath Basha), మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి 9Ravindranath Reddy), మాజీ మేయర్ పాకా సురేశ్(Paka Suresh) తో పాటు మరికొందరు నేతలను కడపలో అదుపులోకి తీసుకుని పులివెందులకు తీసుకొచ్చారు. అవినాష్‌ను గృహ నిర్బంధం చేశారు. ఓ వైపు ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటం, మరోవైపు బుధవారం జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.








