తెలంగాణ రక్షణసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాంత్‌గౌడ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానం ఎన్నికలో తెలంగాణ రక్షణసేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డా.నలమాస శ్రీకాంత్‌గౌడ్ (Dr. Nalamasa Srikanth Goud)ను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యాక్రమంలో కవిత ఈ విషయాన్ని వెల్లడించి అభ్యర్థిని అభినందించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తగా పార్టీ సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ (Syed Ismail)ను కవిత నియమించారు.








