ఈ నెల 27 నుంచి ఎంపీ ఈటల పాదయాత్ర
జవహర్ నగర్ డంప్‌యార్డు (Jawahar Nagar dump yard)ను జనావాసాలకు దూరంగా తరలించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ( Eatala Rajender) డిమాండ్ చేశారు. డంప్ యార్డు నుంచి వెలువడుతున్న మీథేన్ గ్యాస్ (Methane gas)తో పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 23న జవహర్ నగర్ బాధితులతో సమావేశం, 25న పర్యావరణవేత్తలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం (Round table meeting) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి డంప్ యార్డుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. చెత్త నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు.








