అమెరికాలోని గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు
అమెరికాలోని గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం (TAGB)ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి.మసాచుసెట్స్ లోని లిటిల్ టన్ హైస్కూల్ పెర్ఫార్సెన్స్ ఆర్ట్స్ సెంటర్ లో ఈ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవాలకు స్థానిక తెలుగు సమాజాల నుంచి 500 మంది హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో ప్రముఖ తెలుగు చలనచిత్ర నేపథ్య గాయని, గేయ రచయిత, వాయిస్ కోచ్ స్పూర్తి జితేందర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికాకు చెందిన లెహరి బ్యాండ్ ప్రతినిధులు డూడుల్, హోప్, హేమన్, సైమన్లతో కలిసి ఆమె అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
అలాగే కళాకాలరులతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆహుతులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘‘సప్త తాండవ’’ నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా హైలెట్ గా నిలిచింది. ష్రూస్బరీలోని ‘నాట్యం స్కూల్ ఆఫ్ డాన్స్’ సంస్థాపకురాలు ఆదిలక్ష్మి గొల్లపూడి నృత్య దర్శకత్వంలో జరిగిన ఈ ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 40 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి. సుమారు 150 మంది కళాకారులు 30 రకాలకు పైగానే వినూత్నమైన ప్రదర్శనలను ఇచ్చారు. అలాగే బతుకమ్మ సంబరాలు కూడా వైభవంగానే జరిగాయి. అన్ని వయస్సుల వారు అద్భుతంగా, ఒకే రీతిలో బతుకమ్మ ఆడారు. ఇక ఇదే వేదికపై హుయ్ షీ నేతృత్వంలోని చైనీస్ నృత్య బృందం ప్రదర్శించిన చైనీస్ వాటర్ డాన్స్ తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచింది. కార్యక్రమంలో భాగంగా పిల్లల కోసం నిర్వహించిన కథల పోటీల విజేతలతో పాటు, టెన్నిస్ క్రీడా పోటీల విజేతలకు వేదికపైనే బహుమతులు, ధ్రువపత్రాలను అందజేశారు. స్థానిక తెలుగు సమాజానికి సేవలు అందిస్తూ, ప్రముఖ షార్ట్ ఫిల్మ్ వర్క్షాప్ను విజయవంతంగా నిర్వహించిన అవార్డు గ్రహీత, దర్శకుడు సంపత్ కందాళను ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వాహకులు విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మరో వైపు ఇదే వేదికపై నుంచి సంస్థకి సంబంధించిన 2026-2027 నూతన కమిటీ, ధర్మకర్తల మండలిని కూడా ప్రకటించారు.
కార్యనిర్వాహక కమిటీ : సుధ మూల్పూర్ (అధ్యక్షురాలు), దీప్తి కోరిపల్లి (అధ్యక్షురాలిగా ఎన్నికైనవారు), జగదీష్ చిన్నం (కార్యదర్శి), సూర్య తేలప్రోలు (కోశాధికారి), మానస కృష్ణ (సాంస్కృతిక కార్యదర్శి).
ధర్మకర్తల మండలి : కాళిదాస్ సురపనేని (అధ్యక్షుడు), చంద్ర వల్లూరుపల్లి, కళ్యాణ్ కాకి, శిరీష కేతిరెడ్డి ( సభ్యులు), శ్రీనివాస్ గొంది ( సభ్యుడు).








