వంశీరెడ్డి నివాసానికి యూఎస్ సెనేటర్ కోరీ బుకర్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, క్వాడ్రెంట్ టెక్నాలజీస్ సీఈవో, ప్రెసిడెంట్ వంశీరెడ్డి నివాసానికి యూఎస్ సెనేటర్ కోరీ బుకర్ వెళ్లారు. ఈ సందర్భంగా వంశీరెడ్డి బుకర్ ను ఘనంగా స్వాగతించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి రోడ్స్ స్కాలర్‌గా ఆక్స్ఫర్డ్, యేల్ లా స్కూల్ వరకు, ఆపై నెవార్క్ మరియు ఇప్పుడు యు.ఎస్. సెనేట్‌లో న్యూజెర్సీ ప్రజలకు సేవ చేస్తూ సాగిన కోరీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమని వంశీరెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు సేవచేయాలన్న తపన, నిబద్ధత బుకర్ కి చాలా వుందని, నెవార్క్ ప్రజలకు, ఆ తర్వాత అమెరికా సెనేట్‌లో న్యూజెర్సీ ప్రజలకు ఆయన అందించిన సేవలు అభినందనీయమన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నాయకత్వ లక్ష్యమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఆయన ఆప్యాయత, ఆలోచనాత్మక దృక్పథాలు, మరియు ప్రజలను ఏకం చేయాలనే తపన తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చారు. తన నివాసంలో స్నేహితులు, ఇతర సమాజానికి చెందిన నేతలతో బుకర్ తో కొంత సంభాషణ కూడా నడించిందని చెప్పుకొచ్చారు. ఇలా బుకర్ తో తమ ఆలోచనలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వంశీరెడ్డి చెప్పుకొచ్చారు. తమ నివాసానికి విచ్చేసిన సెనేటర్ బుకర్ కి వంశీరెడ్డి ధన్యవాదాలు ప్రకటించారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొని, తనకు మద్దతు పలికిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








