మరోసారి మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆరిలోవ హెల్త్‌సిటీ బీఆర్టీఎస్ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బీఆర్టీ ఎస్ రోడ్డు మీదుగా పాయకరావుపేట (Payakaraopeta,) వెళ్తున్న మంత్రి అనిత రోడ్డు ప్రమాదాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థినులకు తక్షణ సాయం అందించి ఆస్పత్రికి తరళించేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహన డ్రైవర్ (Bolero vehicle driver)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.








