అట్లతద్ది వేడుకల సందర్భంగా “రీల్స్ పోటీ”! త్వరపడండి
తాంటెక్స్ (TANTEX) సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న 40వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా, మహిళల సాంప్రదాయ వేడుక అయిన ‘అట్లతద్ది’ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా “రీల్స్ పోటీ”ని నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి ప్రముఖ ఆభరణాల సంస్థ “ఆభరణ్ బై మల్లికా” (AABHARAN by Mallika) వారు డైమండ్ స్టడ్స్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.
అన్ని వయస్సుల వారు ఈ రీల్స్ పోటీలో పాల్గొనే అవకాశం వుంటుందని తాంటెక్స్ కీలక ప్రకటన చేసింది.
పోటీలో పాల్గొనే విధానమిదీ…
అట్లతద్ది థీమ్‌పై 15 నుండి 90 సెకన్ల నిడివిగల రీల్‌ను తయారు చేయాలి.
తయారైన రీల్‌ను ఇన్స్టాగ్రామ్ (Instagram) లేదా ఫేస్బుక్ (Facebook) వేదికగా పోస్ట్ చేయాలి.
పోస్ట్‌లో @tantex_us1 ను ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలి.
#TANTEXAtlaTadde2026 అనే హ్యాష్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఇక.. రీల్స్ నిపంపడానికి చివరి తేదీ అక్టోబర్ 22 గా నిర్ణయించారు. అక్టోబర్ 24 వ తేదీన రిజల్ట్స్ ప్రకటించారు.
మరిన్ని వివరాలకు
వనిత వేదిక ఛైర్: దీపిక పెట (ఫోన్: 405-443-1539)
ఈవెంట్ కోఆర్డినేటర్: దీప్తి సూర్యదేవర (ఫోన్: 469-215-9669)
అధ్యక్షురాలు: మాధవి లోకిరెడ్డి (ఫోన్: 734-705-9966)
సహకారం: తాంటెక్స్ పాలకమండలి (TANTEX Governing Board) సంప్రదించవచ్చు.








