రేవంత్ రెడ్డి హడావిడి కొన్నిరోజులే .. ఆ తర్వాత మళ్లీ కేసీఆరే సీఎం : కేటీఆర్
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకమయ్యే రోజులు వస్తున్నాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హడావిడి కొన్నిరోజులే.. ఆ తర్వాత కేసీఆర్ (KCR) సీఎం అవుతారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు కీలకమవుతాయి. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఏం చేసినా లాభం లేదు. మోదీ (Modi) వల్ల ఏం జరిగిందో చూస్తున్నాం. కాంగ్రెస్ విఫలమైనందునే సీజేపీ (CJP) పేరుతో యువత పోరాటం చేస్తోంది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క ఎంపీ కూడా పనిచేయడం లేదు. కాంగ్రెస్ చేతితో మోసపోయిన వర్గాలన్నీ బీ ఆర్ ఎస్ వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పెడుతున్నారు. ఎల్‌నినో ఉందని 10 నెలల ముందే నిపుణులు చెప్పారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.








