వైసీపీ నేత జక్కంపూడి రాజాకు షాక్
వైసీపీ నేత జక్కంపూడి రాజా (Jakkampudi Raja)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠ (Anaparthi Manikanta)పై జక్కంపూడి రాజా దాడి చేశారు. కోరుకొండ మండలం బుచ్చంపేట ఎంపీటీసీ అభ్యర్థి (Buchampeta MPTC candidate)గా మణికంఠ పోటీ చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో కోరుకొండ పోలీసులు (Korukonda Police) కేసు నమోదు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ హెచ్చరించారు.








