శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో భారీగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు (DRI officials) స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ (Kuala Lumpur) వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని గుర్తించారు. ఎయిర్ ఏషియా(AirAsia) ఏకే-68 విమానంలో వెళ్లేందుకు వీరు సిద్దమవుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.








