బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా దసరా, దీపావళి సంబరాలు
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, దీపావళి ధమాకా 2026 ఘనంగా జరిగింది. LITTLETON HIGH SCHOOL 56 KING ST, LITTLETON, MA వేదికగా ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో శివుని ఏడు దివ్య నృత్యాలను, వాటి వెనుక ఉన్న పౌరాణిక కథలను వర్ణించే అద్భుతమైన నృత్య రూపకం “సప్త తాండవం” ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సాంప్రదాయ బతుకమ్మ ఉత్సవాలను గౌరవిస్తూ నిర్వహించిన నృత్య, సంగీత వేడుక ఆ సాయంత్రం యొక్క మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘హుయ్ షీ’ నేతృత్వంలోని చైనీస్ నృత్య బృందం కూడా తమ మనోహరమైన “చైనీస్ వాటర్ డాన్స్”ను తెలుగు ప్రేక్షకులతో మొదటిసారిగా పంచుకుంది. ఉత్సాహభరితమైన వేడుకలకు తోడుగా, రుచికరమైన బంతి భోజనాల విందును అందరూ ఆస్వాదించారు.ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు చాలా ఉత్సాహంగా పాల్గొని, వివిధ ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా వాలెంటీర్లు చాలా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు.








