ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముగిసిన సీఎం సమీక్ష సమావేశం
బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాజ్య సభ సభ్యులు ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలక చర్చలు
తుమ్మిడిహెట్టిపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం ఆదేశాలు.
ఈనెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని ఇటీవలే మహారాష్ట్ర సీఎం సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తీసుకునే వీలుంది.. మహారాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ముంపునకు గురవుతుందో వివరించిన అధికారులు.
అటవీ, గిరిజన వెనుకబడ్డ ప్రాంతమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా బ్యారేజీ ఎత్తు ఉండాలని సూచించిన సీఎం.
అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు వీలుగా అవసరమైన అన్ని నివేదికలు సిద్దంగా ఉంచాలని, ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల వివరాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించిన సీఎం.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీ, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
అందుకు వీలుగా శ్రీశైలం, నార్లాపూర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు అదనంగా తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు. దీంతో పాలమూరు నీటికి ఎలాంటి ఢోకా ఉండదని సీఎం సూచన.
అందుకు అవసరమైన పంప్ హౌజులు, పంపులు, సిస్టమ్ వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.








