ఘనంగా ఒరేగాన్ తెలంగాణ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు
ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ నగరం లో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆద్వర్యం లో నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగాయి. R.A Brown Middle School లో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శనివారం రోజు జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు మరియు చిన్నారి అమ్మాయిలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటల తో సందడి చేసారు. మొదటి సారి పురుషులు, మహిళలు మరియు పిల్లలు కోలాటం ఆట లో ఎంతో హుషారుగా పాల్గొన్న వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు అందరు గౌరమ్మ మరియు ప్రసాదం ని ఇచ్చి పుచ్చుకున్నారు. దసరా ఉత్సవాన్ని షమీ స్తోత్రం అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ భలాయ్ చేసికున్నారు. బతుకమ్మ మరియు రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ రుచికరమైన భోజనం ని వడ్డించారు.
ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల OTA టీం తరుపున బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పండుగలని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికి శ్రీని ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలని అత్యంత అంగ రంగ వైభవవోపేతంగా జరిపి విజయవంతం అవటానికి కృషి చేసిన OTA టీం మరియు వాలంటీర్స్ – సురేష్, శ్రీపాద్, భాస్కర్, రఘు.S, శ్రీని.G, అరుణ్, ప్రదీప్, అజయ్, శ్రీకాంత్, నవీన్, రఘు.బి, జయ్, మరియు అభిరాం, మరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ప్రశంసలు తెలియ చేసారు. చివరగా వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకి, శ్రేయలోభిలాషులకి OTA టీమ్ తరుపున అభింకందనలు తెలిపారు.









