శాన్ హోసే వేదికగా అక్టోబర్ 24న ‘దివాళీ కార్నివాల్ అండర్ ది స్టార్స్’..
కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోసే నడిబొడ్డున ఉన్న చారిత్రక ప్లాజా డి సెసార్ చావెజ్ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో ‘దివాళీ కార్నివాల్ అండర్ ది స్టార్స్’ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 24, 2026, శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రవేశం పూర్తిగా ఉచితం, అందరికీ ఆహ్వానం.
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రసిద్ధ గాయకుడు అభి వి (ABBY V) లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అలరించనుంది. బే ఏరియా ప్రజలకు ఇది అద్భుతమైన సంగీత విందును అందించనుంది.
దీపోత్సవ ప్రత్యేక కార్యక్రమం…
ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టంగా సాయంత్రం 6:45 నుండి 7:30 గంటల వరకు సాంప్రదాయ దీపాల వెలిగింపు కార్యక్రమం (లాంప్-లైటింగ్ సెరెమనీ) నిర్వహిస్తారు. శాన్ హోసే మేయర్ మాట్ మహన్, భారత కౌన్సిల్ జనరల్ సతీష్ శివన్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపోత్సవాన్ని మీడియా ప్రతినిధులు కవర్ చేయడానికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు.
ఇవి కూడా చదవండి
కార్నివాల్ విశేషాలు…
- లైవ్ బాలీవుడ్ సంగీత, నృత్య ప్రదర్శనలు.
- రంగుల ఫ్యాషన్ షో.
- భారతీయ వస్త్రాలు , ఆభరణాల విక్రయశాలలు.
- కుటుంబ సభ్యులు, చిన్నారుల కోసం ప్రత్యేక కిడ్స్ జోన్.
- హెన్నా ట్యాటూలు.
- మొదటి 2000 మంది హాజరైన వారికి ఉచిత గ్లోస్టిక్స్.
- చాట్, దోశలు, బిర్యానీ వంటి అసలైన భారతీయ స్ట్రీట్ ఫుడ్స్, ఛాయ్ బార్, డెజర్ట్ జోన్ , లైవ్ జలేబి స్టేషన్.
ఈ వేడుకలకు అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బొల్లీ 92.3 ఎఫ్ఎం, శాన్ హోసే డౌన్‌టౌన్ అసోసియేషన్, శాన్ హోసే నగరపాలక సంస్థ, మేయర్ మాట్ మహన్, పార్క్ఎస్జే సహకారం అందిస్తుండగా, ఎన్బీసీ బే ఏరియా అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు ఈ వేడుకలను కవర్ చేయాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.
మరిన్ని వివరాల కోసం అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) అడ్వైజరీ టీమ్ సభ్యులు డా.రమేష్ కొండను 510-565-2495 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.








