భారీ మల్టీస్టారర్ కు రెడీ అవుతున్న నెల్సన్
జైలర్2(jailer20తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson dileep kumar) నెక్ట్స్ ప్రాజెక్టులపై సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth)ను ఆయన స్క్రీన్‌పై చూపించిన విధానానికి ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్సన్ తన తర్వాతి సినిమాను హృతిక్ రోషన్(Hrithik Roshan)తో చేయనున్నారని, ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్(Hombale films) నిర్మించనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నెల్సన్ దృష్టి మరో క్రేజీ కాంబినేషన్‌పై ఉన్నట్లు సమాచారం.
కోలీవుడ్ లో ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న రజినీకాంత్, కమల్ హాసన్(Kamal Haasan) కలయికలో సినిమా తెరకెక్కించేందుకు నెల్సన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ ఆల్రెడీ రెడీ అయిందని, దాన్ని ఫుల్ లెంగ్త్ స్క్రీన్‌ప్లేగా మలిచేందుకు నెల్సన్ దాదాపు ఆరు నెలల టైమ్ కేటాయించనున్నారని సమాచారం. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Rajkamal films international) ఈ భారీ మల్టీస్టారర్‌ను నిర్మించనుందని టాక్. ఈ సినిమా ఆగిపోయిందంటూ గతంలో వచ్చిన ఊహాగానాలకు భిన్నంగా, ప్రాజెక్టు ముందుకు సాగుతోందనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఇవి కూడా చదవండి
రజినీకాంత్, కమల్ హాసన్‌లతో సినిమా పూర్తైన తర్వాత నెల్సన్ తన నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్(NTR)తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మాణంలో ఈ యాక్షన్ డ్రామా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం జైలర్2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నెల్సన్, త్వరలోనే రజినీకాంత్, కమల్ హాసన్ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ను స్టార్ట్ చేయనున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే, నెల్సన్ కెరీర్లోనే అత్యంత ఆసక్తికరమైన దశగా నిలిచే అవకాశం ఉంది.








