సంజన అన్నే దర్శకత్వంలో ‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ మీద వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నరు. భారత సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు నటిగా, దర్శకురాలిగా, నిర్మాత గా గిన్నిస్ బుక్‌లోకెక్కిన నటీమణి శ్రీమతి విజయ నిర్మల, ప్రస్తుతం ఆమె తరువాత అదే స్థాయిలో నటిగా దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న సంజన అన్నేఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. శుక్రవారం నాడు నిర్వహించిన పూజా కార్యక్రమానికి మంచు మనోజ్, అలీ, విజయ్ కనకమేడల, ఆర్పీ పట్నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, రమేష్ పుప్పాల, సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, విఎన్ ఆదిత్య, తెలుగు టైమ్స్ పత్రిక అధినేత సి వి సుబ్బారావు, జ్యోత్స, లేబర్ కమిషనర్ గంగాధర్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేయగా.. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం
సంజన అన్నే మాట్లాడుతూ .. ‘మా ‘మిస్టర్ దెయ్యం’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ థాంక్స్. నా ప్రయాణంలో మీడియా ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటూ వస్తోంది. మా ఈ నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం’కి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు ఖయ్యూమ్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ దెయ్యం’ టైటిల్ బాగుంది. ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించబోతోన్నాను. ఎప్పటిలానే నన్ను, నా ఈ మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
విజయ్ శంకర్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ దెయ్యం’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇలాంటి అద్భుతమైన సంస్థలో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. సంజన గారు ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా రానుంది. ఇది వరకెన్నడూ చూడనటువంటి హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదొక బెస్ట్ హారర్ మూవీగా నిలుస్తుంది’ అని అన్నారు.
సిరి చౌదరి మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ దెయ్యం’ మూవీ ఓపెనింగ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. మా సినిమాను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ దెయ్యం’ అందరినీ భయపెడుతూ, నవ్వించేలా ఉంటుంది. సంజన గారితో ఇది వరకు నేను పని చేశాను. ఈ సినిమా అందరినీ అలరించేలా ఉంటుంది’ అని అన్నారు.









