ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. వైరల్‌గా మారిన సందీప్ వంగా ఫొటో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు ఆసక్తిని కలిగించే ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలో ప్రభాస్, సందీప్ సరదాగా కనిపించారు. సందీప్ ఓ బాటిల్‌ను తెరుస్తుండగా, పక్కనే ఉన్న ప్రభాస్ తనదైన చిలిపి ఎక్స్ప్రెషన్స్ తో కనిపించడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందీప్ ఈ ఫొటోను పోస్ట్ చేయడంతో అభిమానుల దృష్టి ఒక్కసారిగా దీనిపై పడింది. సాధారణంగా తన సినిమాల్లో ఎమోషనల్ డెప్త్, స్ట్రాంగ్ క్యారెక్టర్లను చూపించే సందీప్ రెడ్డి వంగా.. ఇలా సరదాగా కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరోవైపు ప్రభాస్ తనదైన స్టైల్‌తో ఈ ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఫొటో షూటింగ్ టైమ్ లో తీసిందా? లేక ఇతర సందర్భానికి సంబంధించినదా? అనే విషయంపై క్లారిటీ లేదు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న స్పిరిట్(Spirit) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సందీప్ మార్క్ మేకింగ్‌లో ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారనే ప్రశ్న ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచుతోంది. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫొటో సినిమాపై డిస్కషన్ ను మరోసారి పెంచగా, స్పిరిట్ నుంచి నెక్ట్స్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








