నాని ప్లానింగ్ మామూలుగా లేదుగా!
నేచురల్ స్టార్ నాని(nani) తన సినిమాల విషయంలో వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఇటీవల ది ప్యారడైజ్(The Paradise)తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో(Bloody Romeo)పై దృష్టి సారించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమాను ప్రారంభించిన నాని, అటు షూటింగ్‌తో పాటు ఇటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో మేకర్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
బ్లడీ రోమియో సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో నాని ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక సినిమా పూర్తైన తర్వాత మరో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టే విధానానికి భిన్నంగా, ముందస్తు ప్లానింగ్ తో వర్క్స్‌ను చకచకా పూర్తి చేసేలా నాని అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, బ్లడీ రోమియో తర్వాత కూడా నాని తన కెరీర్లో వైవిధ్యానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మరో సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. పూర్తిస్థాయి ఆఫ్‌బీట్ కథాంశంతో ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తున్న నాని రాబోయే ప్రాజెక్టులు ఎలాంటి ఆసక్తిని రేకెత్తిస్తాయో చూడాలి.








