ట్రెండీ లుక్స్‌లో గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)తన స్టైలిష్ ఫోటోషూట్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంటోంది. బర్గండీ కలర్ ఎత్నిక్ వేర్లో ట్రెడిషనల్ అందాలను చాటుకుంటూ, గోల్డ్ జ్యువెలరీతో మెరిసిపోతోంది. చేతిలో మెటాలిక్ క్లచ్, ఎట్రాక్టివ్ మేకప్‌తో పూజా లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. మరో లుక్‌లో లైట్ గోల్డ్ కలర్ అవుట్‌ఫిట్‌తో క్లాసీగా కనిపిస్తోంది పూజా. ట్రెండీ హెయిర్‌స్టైల్, భారీ ఇయర్రింగ్స్, గోల్డ్ యాక్సెసరీస్‌తో మోడ్రన్ ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనం ఇస్తోంది. సంప్రదాయ, ఆధునిక శైలులను అందంగా మేళవిస్తూ తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంటోంది. రెండు విభిన్న లుక్స్‌లోనూ తనదైన స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేస్తోంది పూజా. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.








