నిఖిల్ స్వయంభూ రిలీజ్‌పై ఇంకా సస్పెన్సే!
యంగ్ హీరో నిఖిల్(nikhil) కెరీర్లోనే మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు గా నిలిచిన స్వయంభూ(Swaymabhu) రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ తనను తాను పూర్తిగా మార్చుకుని, స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు క్యారెక్టర్ కు అవసరమైన మేకోవర్ పై ఎంతో టైమ్ కేటాయించారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ దాదాపు 150 రోజుల పాటు కొనసాగింది. రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ, సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి స్వయంభూ రిలీజ్ కు సంబంధించి గతంలో పలు ప్లాన్స్ తెరపైకి వచ్చాయి. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన తర్వాత కూడా పోస్ట్‌పోన్ అవడంతో ఫ్యాన్స్ లో నిరీక్షణ పెరిగింది. ముఖ్యంగా సినిమాకు కీలకంగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ అనుకున్న టైమ్ కు పూర్తికాకపోవడం రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అక్టోబర్‌లోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరిగినా, దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. భారీ విజువల్స్‌తో కూడిన ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రెడీ చేయడంపైనే మేకర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మరోవైపు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో స్వయంభూకు సరైన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్‌పై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తై, రిలీజ్ డేట్ పై త్వరలోనే చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.








