సూర్య, నజ్రియా నజీమ్ ‘సీన్’ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా ద్వారా నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ ‘ఏరోప్లేన్’ అదిరిపోయే ఎనర్జీతో ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్.
‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.








