ప్రభాస్ నెక్స్ట్ లిస్ట్‌లో క్రేజీ డైరెక్టర్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫౌజీ(Fauzi) సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, ఆ తర్వాత స్పిరిట్(Spirit), కల్కి 2898 ఏడీ(Kalki2898AD) సీక్వెల్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2027 చివరి నాటికి పూర్తి చేయాలనే టార్గెట్ తో ఆయన ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం డిస్కషన్స్ దశలో ఉన్న కొత్త ప్రాజెక్టుల్లో ఏదీ అఫీషియల్ గా ఫిక్స్ అవలేదు.
ది రాజాసాబ్(the rajasaab) రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa prasad)తో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకుని డైరెక్టర్ గా మారిన కార్తీక్ ఘట్టమనేని(Karthik ghattamaneni) పేరు తెరపైకి వచ్చింది. ప్రభాస్ కోసం ఆయన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ ప్రాజెక్టు ప్రతిపాదనతో విశ్వప్రసాద్ ప్రభాస్‌ను సంప్రదించగా, కథను పూర్తిగా వినేందుకు హీరో ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని మిరాయ్2 పనుల్లో బిజీగా ఉన్నారు.
మిరాయ్2(mirai2) వర్క్స్ పూర్తయ్యాక ప్రభాస్‌కు కథ వినిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. కథ నచ్చి, అన్ని అంశాలు అనుకూలిస్తే 2027లో ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి, 2028లో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశముంది. ఈ సినిమాను థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కేజీఎఫ్(KGF), సలార్(Salaar) వంటి సినిమాలతో బాండింగ్ ఉన్న హోంబలే ఫిల్మ్స్(Hombale films)తోనూ ప్రభాస్ మరో సినిమా చేసేందుకు డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.








