ఫ్యామిలీ కోసం వెంకీ విధ్వంసం.. ఆదర్శ కుటుంబం ట్రైలర్లో యాక్షన్ హంగామా!
విక్టరీ వెంకటేష్(venkatesh), డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలను పెంచిన చిత్ర బృందం తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ కు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా తన ఫ్యామిలీకి ప్రమాదం ఎదురైనప్పుడు హీరో ఎంతటి పోరాటానికైనా వెనుకాడడనే అంశాన్ని ప్రధానంగా చూపించారు.
సాధారణంగా తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో ఆడియనస్ ను అలరించే త్రివిక్రమ్.. ఈసారి యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకున్న ప్రమాదకరమైన గ్యాంగ్‌తో వెంకటేష్ తలపడే సీన్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. వరుస హత్యల నేపథ్యంలో కథలోకి ప్రవేశించే ఈ ముఠా హీరో ఫ్యామిలీ వరకు చేరడంతో పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తాయి. తనవారిని కాపాడుకునేందుకు వెంకటేష్ చేసే ఫైట్ చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా భిన్నమైన ట్రీట్‌ను అందించే అవకాశముంది.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి(Sreenidhi shtty), దేవయాని శర్మ(Devayani sharma), యువినా పార్థవి(Yuvina parthavi), నివేదా పేతురాజ్(nivetha pethuraj), నారా రోహిత్(nara rohit), పూజిత పొన్నాడ(Poojitha ponnada) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(harika hasini creations) బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ(S Radhakrishna) నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. వెంకటేష్ యాక్షన్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ వెండితెరపై ఎలాంటి అనుభూతిని అందిస్తాయో చూడాలి.








