చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఛైర్పర్సన్ (Municipal Chairperson) అభ్యర్థిగా బరిలో ఉన్న షేక్ కరీమున్ (Shaik Karimun), ఆదివారం రాత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే భర్త యూసుఫ్ అలీతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ గా పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి (Thota Rajarajeswari)కి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలోనే వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థిని విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కూటమి ప్రభుత్వ సహకారంతో పట్టణాభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి, తాము కూడా అందులో భాగస్వాములు కావాలని నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇక తాము కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటామన్నారు. కూటమి పురపాలక ఛైర్పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తోట రాజారమేష్ ఇందులో పాల్గొన్నారు.








