తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ ఏరియా సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ ‘‘ఆరోగ్య మేళా’’
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ ఏరియా సంఘం (TAGCA) ఆధ్వర్యంలో ‘‘ఆరోగ్య మేళా’’ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ చార్లెట్ తెలుగు అసోసియేషన్ (TAGCA), ‘శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిర్’ సహకారంతో స్థానిక ప్రవాస తెలుగు ప్రజల కోసం మరియు సమాజం కోసం హెల్త్ ఫెయిర్ నిర్వహిస్తోంది. Early detection, better protection, your health our commitment అన్న థీమ్ తో ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం రెండు విడతలుగా జరుగుతోంది.

అయితే ఈ మొదటి విడత ఆరోగ్య శిబిరం పైన్విల్లె డెంటల్ స్టూడియో, 10635 పార్క్ రోడ్ సూట్ బి, చార్లెట్, NC 28210.వేదికగా జరిగింది. ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే వైద్యులను సంప్రదించి, తమ ఆరోగ్య సమస్యలను చూయించుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి సంస్థ వాలెంటీర్లు విశేష కృషి చేశారు., అక్కడికి వచ్చిన పేషెంట్స్ కి అత్యంత ఓపికతో, వారి అవసరాలు తీర్చారు. అక్కడి వైద్య బృందం కూడా పూర్తి సేవా దృక్పథంతో సేవలందించారు. రుమటాలజీ నిపుణులు డాక్టర్ శ్రీలత చలసాని ఆధ్వర్యంలో వైద్య బృందం విశేష సేవలందించింది.
ఇవి కూడా చదవండి

ఇక రెండో విడత ఆరోగ్య శిబిరం అక్టోబర్ 31 వ తేదీన జరగనుంది. శ్రీ సాయి గురుదేవ దత్త మందిర్ 10345KERNSRD, HUNTERSVILLE, NC 28078 వేదికగా జరగనుంది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరగనుంది. నిపుణులైన వైద్యులచే ఉచితంగా సంప్రదింపులు చేయవచ్చు. అలాగే ఉచితంగానే దంత వైద్యుల్ని కూడా సంప్రదించవచ్చు. దీనికి ఎలాంటి ఇన్సూరెన్స్ అవసరం లేదని నిర్వాహకులు ప్రకటించారు. అయితే.. ఈ శిబిరంలో పాల్గొనాలంటే మాత్రం ముందస్తుగా కన్సల్టేషన్, అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి వుంటుంది. www.tagca.org/healthfair వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని తెలుగువారందరూ ఉపయోగించుకోవాలని TAGCA కోరుతోంది. తెలుగు వారందరూ ఆరోగ్యవంతులుగా వుండాలన్నదే తమ అభిమతమని, ఈ కారణంగానే ఆరోగ్యమేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం సురేంద్ర యలవర్తి+17048064131 నెంబరులో సంప్రదించవచ్చు.
సేవలు అందించనున్న నిపుణైన వైద్యులు:
డా.శ్రీలత చలసాని – రుమటాలజీ (Rheumatology)
డా. నిశ్చల్ నాథా – ఆర్థోడాంటిస్ట్ (Orthodontist)
డా. శ్రీనివాస్ కోయ – ఇంటర్నల్ మెడిసిన్ (Internal Medicine)
డా. శోభ జయరామ్ -న్యూరాలజీ (Neurology)
డా. కృష్ణ జొన్నలగడ్డ – ఇంటర్నల్ మెడిసిన్ & గెరియాట్రిక్స్ (Internal Medicine, Geriatrics)








