TACO ఆధ్వర్యంలో పాటల పోటీలు.. నవంబర్ 15 న గ్రాండ్ ఫైనల్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో ఆధ్వర్యంలో (TACO) ఆధ్వర్యంలో TACO2026 పాటల పోటీ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించారు. ప్రతిభ, అభిరుచి కలిగిన గాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. చాలా అద్భుతంగా తాము ఎంపిక చేసుకున్న పాటలను గాత్రంగా పాడారు.

అయితే.. నవంబర్ 15 వ తేదీన గ్రాండ్ ఫైనల్స్ కూడా జరగనున్నాయి. ఫైనలిస్టుల జాబితా త్వరలోనే ప్రకటిస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించారు. ఇక.. ఈ సందర్భంగా సహకరించిన న్యాయనిర్ణేతలకు , వాలెంటీర్లకు, గాయనీ గాయకులను ప్రోత్సహించిన గురువులకు అందరికీ కూడా నిర్వాహకులు ధన్యవాదాలు ప్రకటించారు.








