డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు పఠనా పోటీలు
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగుపై మరింత పట్టు సాధించడానికి ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘‘ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు పఠనా పోటీలు’’ పేరుతో పోటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శివరాం ప్రసాద్ యార్లగడ్డ సమర్పిస్తున్నారు.
అక్టోబర్ 25వ తేదీన ఉదయం గంటల నుంచి ఈ పోటీలు ప్రారంభం అవుతాయి. SV టెంపుల్,26233 టాఫ్ట్ రోడ్, నోవై, మిచిగన్ 48374 వేదికగా ఈ తెలుగు పఠనా పోటీలు జరగనున్నాయి. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శుభ్రతా గడ్డం, సాంస్కృతిక కార్యదర్శి అర్చన చవాళ్ల సారథ్యంలో ఈ పోటీలు జరగనున్నాయి.
5TH క్లాస్ లోపు పిల్లలకు మొదటి బహుమతి కింద 100 డాలర్లు, రెండో బహుమతి కింద 75 డాలర్లు, మూడో బహుమతి కింద 50 డాలర్లుగా నిర్ణయించారు.
అలాగే 6TH-8TH క్లాస్ వారికి మొదటి బహుమతి కింద 200డాలర్లు, రెండో బహుమతి కింద 100డాటలర్లు, మూడో బహుమతి కింద 50 డాలర్లుగా నిర్ణయించారు. ఇందులో పాల్గొనే వారు ఇందులో వున్న ఫ్లయర్ లో వున్న స్కానింగ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు .
మరిన్ని వివరాల కోసం అర్చన చవాళ్ల 313-585-3145, శుభ్రత గడ్డం 734-972-3536 సంప్రదించవచ్చును.








