రాచమల్లుకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు హెచ్చరిక
కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Rachamallu Sivaprasad Reddy) పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో ఆదినారాయణ రెడ్డి మీడియాతో రాచమల్లు అతిగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని అన్నారు. ఆయనది దొంగ క్యారెక్టర్ అని, స్థలాల దొంగ అని వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు (Proddatur)లో తమకు చెక్ పెడతామని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేత నందం సుబ్బయ్య (Nandam Subbaiah)ను హత్య చేయించారని కూడా ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కడప జిల్లా (Kadapa District)లో ఒకప్పుడు ఫ్యాక్షన్లు తీవ్రంగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, అభివృద్ధి మొదలైందని అన్నారు.








