టాక్సిక్ ఫ్లాప్.. రామాయణతో రికార్డుల వేట!
కేజీఎఫ్(KGF) సినిమాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యష్(Yash).. ఇప్పుడు రామాయణ(Ramayana)తో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన టాక్సిక్(Toxic) ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో యష్‌పై విమర్శలు, ట్రోలింగ్ ఎదురయ్యాయి. అయితే వాటికి ఏమాత్రం ప్రభావితం కాకుండా తన తప్పులను అంగీకరిస్తూ ముందుకు సాగారు. నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా రామాయణను సెలెక్ట్ చేసుకుని తన సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో రావణుడి పాత్రను పోషించిన ఆయన.. తాజాగా తన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
స్క్రీన్ పై యష్ చూపించిన గంభీరమైన ఉనికి, పవర్ఫుల్ యాక్టింగ్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రావణుడి క్యారెక్టర్ కోసం ఆయన చేసిన కసరత్తు, బాడీ మేకోవర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకున్న తీరు అభిమానులను ఖుషీ చేస్తోంది. హీరో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) కనిపిస్తున్నప్పటికీ, రావణుడిగా యష్ తనదైన ముద్ర వేస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి
ఇక రామాయణ రెండో భాగంలో యష్‌కు మరింత విస్తృతమైన పాత్ర ఉండనుందని సమాచారం. దీంతో ఈ ఇతిహాస కథలో ఆయన పాత్ర కీలకంగా మారనుంది. నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి(Sai Pallavi) నటించారు. టాక్సిక్ తో ఎదురైన ప్రతికూలతలను పక్కనపెట్టి, రావణుడిగా యష్ చూపిస్తున్న ఇంపాక్ట్ ఆయన కెరీర్లో మరో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.







