రెండోసారి పేరెంట్స్ కాబోతున్న కిరణ్ దంపతులు?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన భార్య రహస్య గోరఖ్(Rahasya Gorakh) మరోసారి ప్రెగ్నెంట్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం కానీ, రహస్య కానీ అఫీషియల్ గా రెస్పాండ్ అవలేదు. దీంతో ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా, 2025 మే 23న ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు.
కిరణ్, రహస్య పరిచయం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు(Raja varur rani garu) సినిమా టైమ్ లో ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, ఐదేళ్లపాటు కొనసాగింది. తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట చివరకు 2024 ఆగస్టు 22న పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కిరణ్ కెరీర్లో క సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
మరోవైపు కిరణ్ అబ్బవరం ఇప్పుడు డైరెక్టర్ గానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తన స్వీయ దర్శకత్వంలో రియాలిటీ(Reality) అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఆనందం అనే హోటల్ మేనేజర్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో(Bheems ciciroleo) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇంద్రపుత్ర(Indraputra) అనే పాన్ ఇండియా ఫాంటసీ సినిమా కూడా ఆయన లైనప్లో ఉంది. కెరీర్ పరంగా కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్న కిరణ్ ఇంట రెండో బిడ్డ రాకపై వస్తున్న ప్రచారానికి ఎప్పుడు తెరదించుతారో చూడాలి.







