10th November2026

_________

- Bhuvana

ముఖంపై సహజమైన మెరుపు కోసం ఈ 7 హోమ్‌మేడ్ ఫేస్‌ప్యాక్స్ 

ఎలాంటి రసాయనాలు లేకుండా, ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి సహాయపడే 7 అద్భుతమైన హోమ్‌మేడ్ ఫేస్‌ప్యాక్స్ ఇవే!

ఒక స్పూన్ శెనగపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరాక కడిగితే చర్మంపై ఉండే మృతకణాలు తొలగి సహజమైన మెరుపు వస్తుంది.

శెనగపిండి & పసుపు గ్లో ప్యాక్

సరిసమానంగా తేనె మరియు నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే ట్యాన్ తొలగిపోయి ముఖం తక్షణమే కాంతివంతంగా మారుతుంది.

తేనె & నిమ్మరసం ఫేస్‌ప్యాక్

బంగాళదుంప రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే నల్లటి మచ్చలు, కంటి కింద వలయాలు క్రమంగా తగ్గి చర్మం తెల్లగా మారుతుంది.

బంగాళదుంప రసం & తేనె ప్యాక్

ఎప్పడూ ట్రెండింగ్‌లో ఉండే ముల్తానీ మట్టిలో గులాబీ నీరు (రోజ్ వాటర్) కలిపి రాస్తే అధిక జిడ్డు తొలగిపోయి, ముఖం తాజాగా మరియు చల్లగా ఉంటుంది.

ముల్తానీ మట్టి & రోజ్ వాటర్

పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేసుకుని ఆరనివ్వాలి. ఇది చర్మానికి మంచి పోషణనిచ్చి డ్రైనెస్‌ను దూరం చేస్తుంది.

పపాయా & తేనె మాయిశ్చరింగ్ ప్యాక్

తురిమిన కీరదోసకాయ రసంలో కొద్దిగా పెరుగు కలిపి రాసుకుంటే వేసవి లేదా చలికాలంలోనూ చర్మానికి తేమ అందడంతో పాటు అలసట మాయమవుతుంది.

కీరదోసకాయ & పెరుగు ప్యాక్

టమాటా రసంలో కొద్దిగా చందనం పొడి కలిపి రాస్తే చర్మానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ లభించి, మొటిమలు మరియు వాటి తాలూకు మచ్చలు తగ్గిపోతాయి.

టమాట గుజ్జు & చందనం పొడి

ఈ ఫేస్‌ప్యాక్స్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి, చివరగా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎలాంటి ఖరీదైన క్రీమ్‌లతో పనిలేకుండా, మీ వంటింటి పదార్థాలతోనే ఈ హోమ్‌మేడ్ ఫేస్‌ప్యాక్స్‌ను ట్రై చేసి సహజమైన మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి!