బ్లాక్ శారీలో త్రిప్తి డిమ్రి అందాల మెరుపులు
యానిమల్(Animal) సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ ను దక్కించుకున్న త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాలో కనిపించేది కాసేపే అయినా భారీ గుర్తింపును అందుకున్న త్రిప్తి ప్రస్తుతం ప్రభాస్(Prabhas) సరసన స్పిరిట్(Spirit) లో నటిస్తోంది. ఓ వైపు కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ శారీ ధరించి, దానికి తగ్గ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్ లో మెరిసి, మెట్లపై కూర్చుని ఫోటోలకు పోజులివ్వగా, ఆ ఫోటోల్లో త్రిప్తి అందాలు చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. త్రిప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







