పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
MCRHRD లోని బోధి పెవిలియన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని ప్రపంచానికి చాటడమే ప్రభుత్వ ఉద్దేశం
డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం
హైదరాబాద్ వాతావరణం పెట్టుబడులకు అనుకూలం
ఇందులో భాగంగా కర్టెన్ రైజర్ ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో కర్టెన్ రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం.
ముంబై, అహ్మదాబాద్ లోనూ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం
నవంబర్ 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్ కు 70 దేశాల నుంచివెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
భారత్ సమ్మిట్ కు ఆహ్వానించిన
కొంతమందికి మొదట అనుమతులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు నిరాకరించింది
తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా బీజేపీ, బీఆరెస్ వ్యతిరేకిస్తున్నాయి
వివిధ రంగాల్లో వివిధ హోదాలలో ఉన్న వ్యక్తులను భారత్ సమ్మిట్ కు ఆహ్వానించాం
నగరాన్ని ప్రత్యక్షంగా చూసి, పారిశ్రామిక విధానాలను తెలుసుకుంటారని భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం
కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు
పెట్టుబడులను ఆహ్వానించి 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డును, తుమ్మిడిహట్టిని, ఇలా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ, బీఆరెస్ వ్యతిరేకిస్తున్నాయి
వారు వ్యతిరేకించేది కాంగ్రెస్ ను కాదు… తెలంగాణ ప్రజలను..
కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్స్ ను ఆదుకునే ఆలోచన లేదు
గిగ్ వర్కర్స్ చట్టాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నాం
రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ పాలసీ అమలును ప్రారంభించబోతున్నాం
భారత్ సమ్మిట్ లో ముగింపు సందేశాన్ని ఇచ్చేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు
ప్రధాని మోదీ ఇతర దేశాలకు వెళ్లి ఉపన్యాసాలు ఇస్తారు, విదేశాలలో సదస్సులు నిర్వహిస్తారు…
మోదీ ఏది చేసినా కరెక్టు.. రాహుల్ గాంధీ చేస్తే తప్పు అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తుంది
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది
బీజేపీ వైఖరి నియంతృత్వ వైఖరి
ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం
సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని 106 సార్లు మనం సవరించుకున్నాం
ప్రపంచ శాంతి కోసం చర్చ జరగాల్సిన అవసరం ఉంది
భారత్ సమ్మిట్ కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ అతిథి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారు.
ఇప్పటికైనా బీజేపీ నాయకులు విజ్ఞత ప్రదర్శించాలి
మీకు కడుపులో విషం ఉండొచ్చు.. అది తెలంగాణ ప్రజలపై ప్రదర్శించకండి
రాహుల్ గాంధీ బీజేపీని ఓడించి దేశానికి ప్రధాని అవుతారని బీజేపీ భయపడుతోంది
మీ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకించొద్దు
ఢిల్లీల్లో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి పీయూష్ గోయల్ వస్తే మీరు స్వాగతించారు..
కానీ భారత్ సమ్మిట్ కు రాహుల్ గాంధీ వస్తే విమర్శిస్తారా?
బీజేపీని వ్యతిరేకిస్తే భారత దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు..
కాంగ్రెస్ పార్టీ భారత దేశం ఆత్మ
స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది
ఒకరు వినర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ట తగ్గదు
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులలో ఉంది
ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ఆహ్వానించినా హాజరు కాలేదు
ఎల్ నినో పై అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినా రాలేదు
అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తెలంగాణ లెక్కల్లో లేరని భావిస్తున్నాం







