తాజ్ పియర్ హోటల్లో ఘనంగా భారత కాన్సులేట్ దీపావళి వేడుకలు.. హాజరైన ప్రముఖులు!
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 10న న్యూయార్క్ నగరంలోని తాజ్ పియరీ హోటల్లో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే ఈ వేడుకకు భారతీయ-అమెరికన్ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు , పౌర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. చీకటిపై వెలుగు సాధించే విజయమనే దీపావళి సందేశాన్ని, అమెరికా-భారత సంబంధాల ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
సుమారు 300 మంది అతిథులు పాల్గొన్న ఈ వేడుకలో న్యూయార్క్ నగర మాజీ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ గ్రహీత డాక్టర్ సుధీర్ పారిఖ్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పాలసీ ఫరమ్ అధ్యక్షుడు ముఖేష్ అఘి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూఎస్ఏ కంట్రీ హెడ్ అమిత్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలో దీపావళిని ఫెడరల్ సెలవుదినంగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు డాక్టర్ నీతా జైన్ తెలిపారు. చారిత్రక యూఎస్ దీపావళి తపాలా బిళ్ళ రూపకల్పనకు కృషి చేసిన రంజు బాత్రాకు ప్రత్యేక గుర్తింపునివ్వడంతో పాటు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.







