ఫ్రిస్కోలో అట్టహాసంగా ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ‘దివాళీ మేళా’..
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో వేదికగా ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) ఆధ్వర్యంలో ‘ఫ్రిస్కో దివాళీ మేళా-2026’ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. డీఎఫ్డబ్ల్యూ గుజరాతీ సమాజ్ (DFW Gujarati Samaj) సంస్థల ఆతిథ్యంలో జరిగిన ఈ వేడుకలకు అమెరికాలోని ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్రిస్కోలోని కాలిడోస్కోప్ పార్క్ (Kaleidoscope Park) లో జరిగిన ఈ వేడుకలు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టితత్వం, దీపావళి విశిష్టతను చాటిచెప్పాయి. భారతీయ పండుగల గొప్పదనాన్ని ప్రపంచానికి మరోసారి తెలియజేసేలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కార్యక్రమం విజయవంతం కావడానికి నిర్వాహకులు అన్ని వసతులను కల్పించి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డీఎఫ్డబ్ల్యూజీఎస్ నాయకులు, నిర్వహక కమిటీ సభ్యులు, అంకితభావంతో సేవ చేసిన వాలంటీర్లు, స్పాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, కళాకారులు, తెరవెనుక శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది కేవలం దీపావళి పండుగ వేడుక మాత్రమే కాదని, భారతీయ సమాజం ఎంత ఐక్యంగా ఉందో చాటిచెప్పే శక్తివంతమైన వేదిక అని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.
For more photos please click here







