అధికారులు, ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు
సీఐఐ భాగస్వామ్య సదస్సు ( CII Partnership Summit)ను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారికి మెమొంటోలు (Mementoes) అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలతో పాటు అర్నబ్ (Arnab), మురుసు ( Murusu) తుపానులు వచ్చినప్పుడు రాత్రి, పగలు పనిచేసి మళ్లీ ఇప్పుడు సదస్సును విజయవంతం చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా ప్రశంసించారు. సీఎం నుంచి పురస్కారాలు అందుకున్నవారిలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సమాచారశాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథ్, విశా జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చీ, సీఎంఓ ప్రజాసంబంధాల శాఖ అధికారి ధనుంజయ్, సమాచారశాఖ ఆర్జేడీ సదారావు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.







