శాన్ ఆంటోనియోలో జనవరి 17న ‘టాసా’ సంక్రాంతి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ శాన్ ఆంటోనియో (TASA) ఆధ్వర్యంలో మన తెలుగు సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘సంక్రాంతి సంబరాలు-2027’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జనవరి 17, 2027, ఆదివారం రోజున శాన్ ఆంటోనియోలోని శ్రైన్ ఆడిటోరియం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, స్థానిక కళాకారుల ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభంకానున్నాయని నిర్వాహకులు తెలిపారు.







