గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్, రేవంత్ బైక్ ర్యాలీ
హైదరాబాద్ నగరంలో గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. శిల్పకళా వేదిక (Shilpakala Vedika) నుంచి జయభేరి గ్రౌండ్స్ (Jayabheri Ground) వరకు నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు వీరు చేరుకున్నారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.







