బాలల అభ్యున్నతితోనే రాష్ట్ర ప్రగతి : సీఎం చంద్రబాబు
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా విద్య (Education), నైపుణ్యాలు, విలువలతో కూడిన సమగ్ర వికాసానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నేటి బాలలే రేపటి యువత దేశ భవితకు పునాదులని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి కలలను సాకారం చేసేలా ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దడం అందరి బాధ్యతన్నారు. బాలల అభ్యున్నతితోనే రాష్ట్రం (State), దేశ ప్రగతి సాధ్యమని ఆకాంక్షించారు. రేపటి గొప్ప భవిష్యత్తుకు చిన్నారులే పునాదులని మంత్రి లోకేశ్ అన్నారు.







