నాట్స్ నార్తర్న్ కొలరాడో నూతన చాప్టర్ ప్రారంభం.. 2026-2028 నాయకత్వ బృందం ప్రకటన!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో నార్తర్న్ కొలరాడో (Northern Colorado) నూతన చాప్టర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల , ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ.. నార్తర్న్ కొలరాడో చాప్టర్ 2026-2028 నూతన నాయకత్వ బృందాన్ని ప్రకటించి వారికి అభినందనలు తెలిపారు.
ఈ నూతన కమిటీలో చాప్టర్ కోఆర్డినేటర్‌గా స్వామి మండవిల్లి, కో-కోఆర్డినేటర్‌గా రఘు వేదుల, ట్రెజరర్‌గా రాకేష్ బుద్ధవరం, కో-ట్రెజరర్‌గా రమ్య గూడూరు, కల్చరల్ సెక్రటరీగా ఉష ఇనాల, కో-కల్చరల్ సెక్రటరీగా యశస్విని పెండ్యాల ఎంపికయ్యారు. అలాగే, కమ్యూనిటీ సర్వీస్ చైర్‌గా నరేష్ కుంటుమల్ల, పీఆర్ మీడియాగా ఫణి కలవగుంట, మెంబర్షిప్ చైర్‌గా శైలేందర్ బొల్లెట్ల, డిజైన్ కోఆర్డినేటర్‌గా శివ అంగాల, ఆడియో వీడియో కోఆర్డినేటర్‌గా వినోద్ కంటిపూడి, కో-కోఆర్డినేటర్‌గా భరత్ నాగరాజ్, హాస్పిటాలిటీ చైర్‌గా విష్ణు శీల్ల , స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా సాయి మనోజ్ఞ అడపా బాధ్యతలు స్వీకరించారు. ఈ బృందానికి వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) అనుదీప్ అర్ల, బీఓడీ సాయి ప్రసాద్ పలుస, జెడ్వీపీ ఎస్డబ్ల్యూ జోన్ సురేష్ తదితరులు తమ మద్దతు ప్రకటించారు
.







