న్యూజెర్సీలో శ్రీ చిన జీయర్ స్వామికి ఘన స్వాగతం..
జీయర్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూఎస్ఏ (JET New Jersey) ఆధ్వర్యంలో పూజ్య చిన జీయర్ స్వామివారికి న్యూజెర్సీలో స్థానిక కమ్యూనిటీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. న్యూజెర్సీలోని విల్లింగ్బోరో (494 Beverly Rancocas Rd, Willingboro, NJ 08046) వేదికగా నవంబర్ 17 వరకు ఈ దివ్య వేడుకలు నిర్వహిస్తున్నారు.
స్వామివారి 70వ తిరునక్షత్ర వేడుకలతో పాటు, శ్రీ సంజీవని హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం jetnj.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.







