టీటీడీకి రూ.10 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్లోని మణికొండ కు చెందిన కొడాలి శ్రీకాంత్ (Kodali Srikanth) రూ.10 కోట్ల విరాళం అందించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkayya Chowdary)కి విరాళానికి సంబంధించిన చెక్కు (Cheque)ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ (Muralikrishna) తదితరులు పాల్గొన్నారు.







