మృతుల కుటుంబాలకు హోం మంత్రి అనిత పరామర్శ
అనకాపల్లి జిల్లా కొత్త రేపు పోలవరం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) పరామర్శించారు. ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేటకు చెందిన ఆరుగురు యువకులు కారులో రేవు పోలవరం వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి కొత్త పోలవరం (Kotha Polavaram) వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అనిత విశాఖ (Visakha)లో చికిత్స పొందుతున్న ముగ్గురు యువకులను పరామర్శించారు. అనంతరం కొత్త రేపు పోలవరం చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి (Government Hospital)కి వచ్చి మృతుల కుటంబీకులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మృతుల కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.







